BRS | తిమ్మాపూర్, ఏప్రిల్27: మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు ఎల్కతుర్తి బాట పట్టారు. ఆదివారం ఉదయం నుండే సభకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామాల ముఖ్య నాయకులు, గ్రామాల్లోని చౌరస్తాల వద్ద ఉన్న పార్టీ జెండా గద్దెల వద్ద జెండాను గులాబీ జెండాను ఆవిష్కరించి పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన బస్సుల్లో ఉదయమే బయలుదేరారు. రైతులు పనులన్నీ వదిలేసి పార్టీ కోసం సభ బాట పట్టారు.
నుస్తులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ జెండాను ఆవిష్కరించి స్థానిక మండల నాయకులతో కలిసి బస్సులో బయలుదేరారు. మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సభ కోసం నాయకులు ఉత్సాహంగా బయల్దేరి పాల్గొంటున్నారని చెప్పారు. కేసీఆర్ సభ కోసం రైతులు పనులన్నీ వాయిదా వేసుకున్నారని అన్నారు. రైతులకు కేసీఆర్ చేసిన సేవలను వారు మర్చిపోలేదని గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామాల శాఖల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.