Natural Farming | పాలకుర్తి : మార్చి 17 : పాలకుర్తి మండలం కన్నాల గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. గతంలో నమోదు చేసుకున్న రైతులకు ఒక కాన్వాస్ బ్యాగ్, క్యాప్, హ్యాండ్ బుక్ ఫామ్ డైరీ, స్టడీ మెటీరియల్, ద్రావణాలు, కషాయాలు ఎలా తయారు చేయాలని తెలిపే బుక్ లెట్ అందజేశారు. కన్నాల సర్పంచ్ మల్కా రామస్వామి మాట్లాడుతూ కోతుల బెడద లేని ఆయిల్ పామ్ పంటపై మొగ్గు చూపాలని రైతులకు సూచించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు మన ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువులు, పురుగుమందులు, అధిక పెట్టుబడులు లేకుండా, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో పంటలు పండించే విధానంపై అవగాహన కల్పించారు. దీని వల్ల నేల ఆరోగ్యాన్ని, జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తూ విషరహిత ఆహారాన్నిసమాజానికి అందిస్తుందని వివరించారు.
కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ , కేవీకే రామగిరి ఖిల్లా శాస్త్రవేత్తలు డాక్టర్ పీ కిరణ్, డాక్టర్ బీభాస్కర్, జీడి నగర్ సర్పంచ్ సూరం రమా, బామ్ల నాయక్ తండా సర్పంచ్ ఇస్లావత్ అఖిల, విస్తరణ అధికారి శశిధర్, తిరుమల ఆయిల్ పామ్ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశాంత్, అధిక సంఖ్యలో ప్రకృతి సాగు రైతులు పాల్గొన్నారు.