మూడు గంటల్లోనే ఎకరంలో విత్తనం
వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఓవైపు కూలీల కొరత వెంటాడుతుండగా, మరోవైపు సమయం ఆదా కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వస్తున్న యంత్రాలను వినియోగిస్తున్నారు.
- అందుబాటులోకి నూతన యంత్రం
- ఆసక్తి చూపుతున్న రైతులు
వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఓవైపు కూలీల కొరత వెంటాడుతుండగా, మరోవైపు సమయం ఆదా కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వస్తున్న యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు మక్కలు, పత్తి, పల్లి విత్తులు నాటేందుకు యంత్రం రాగా, ఓదెల మండలం కొలనూర్కు చెందిన రైతు పర్శ మధు తన చేనులో మొదటిసారి బుధవారం దీని ద్వారా మక్కలు నాటాడు.
దీని ధర రూ.15 వేలు. ఎకరం మక్క విత్తనాలు నాటేందుకు నలుగురు కూలీలు అవసరం కావడంతో పాటు ఒక రోజు పడుతుంది. ఇందుకు రూ.2 వేల వరకు ఖర్చవుతాయి. ఇదే యంత్రం ద్వారా అయితే, మూడు గంటల్లో ఎకరంలో విత్తనాలు నాటవచ్చని రైతు మధు చెబుతున్నాడు.
-ఓదెల, జనవరి 11
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

