Urea | గన్నేరువరం, ఆగస్టు2: రైతులు మండలకేంద్రంలో ని గ్రోమోర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. యూరియ కోసమని గ్రోమోర్ షాప్ కు వెళ్తే లిక్విడ్ పదార్థాలు కొంటేనే యూరియా ఇస్తామని కోర్రీలు పెడుతున్నారని, బ్లాక్ లో అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా తిరుగుతున్న ఒక్క యూరియా బస్తా ఇవ్వడం లేదని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
బ్లాక్ లో అమ్మడం వల్ల రైతులపై అదనపు భారం పడుతోందని, యూరియా కోసం రైతులను ఇబ్బంది పెడుతున్న గ్రోమోర్ షాపును వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఏవో కిరణ్మయి, పోలీసులు రైతులతో మాట్లాడి రైతులకు సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన చెందవద్దని సముదాయించారు.