కోనరావుపేట, ఏప్రిల్ 26 : కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని కొనకపోవడం.. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా జాప్యం చేస్తుండడంతో రైతన్న కడుపు మండింది. చేసేదేమీ లేక రోడ్డెక్కి ధాన్యాన్ని తగులబెట్టి నిరసనకు దిగారు. ఐకేపీ కేంద్రంలో పోసిన ధా న్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించాలని కోనరావుపేట మండలంలోని అజ్మీరా తండాలో రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నలభై ఐదు రోజుల క్రితం వరి కోతలు కోసి కేంద్రంలో ధాన్యం పోస్తే కొనుగోళ్లు సవ్యంగా జరపడం లేదని మండిపడ్డారు. సెంటర్కు మూడు లారీలు వచ్చి లోడ్ చేసుకొని వెళ్తే ఇప్పటివరకు మరొకటి ఇటువైపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు సిరిసిల్ల-మరిమడ్ల రహదారిపై రైతులు, మహిళలు బై ఠాయించి రెండు గంటల పాటు ధర్నా చేశారు.