Drone mission | మల్లాపూర్, అక్టోబర్ 24 : కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తను పండించిన మక్కజొన్నలు సరిగా ఎండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లాపూర్ మండలం కొత్త ధాం రాజ్ పల్లి గ్రామానికి చెందిన పన్నాల నారాయణ రెడ్డి అనే రైతు వినూత్న పద్ధతిని అవలంభించారు. డ్రోన్ సహాయంతో మొక్కజొన్నలు ఎండబెట్టే కొత్త ప్రయత్నం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
మొక్కజొన్నలు మైదానంలో పోసి డ్రోన్‌ను వినియోగించి మక్కల పై గాలి వీసే విధంగా ఏర్పాటు చేయడంతో వేగంగా ఎండిపోయి మ్యాచర్ తొందరగా వస్తుంది. నారాయణ రెడ్డి చేసిన వినూత్న ఆలోచనను స్థానికులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.