కదిలివచ్చిన కర్షకలోకం
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యాన చేపట్టిన ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ చేపట్టారు.
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పూలమాల వేస్తున్న రైతు
ఎండుతున్న పంటలకు నీళ్లివ్వాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యాన చేపట్టిన ‘36 గంటల రైతు నిరసన దీక్ష’ చేపట్టారు. దీనికి జిల్లా నలుమూలల నుంచి రైతులు కదిలివచ్చారు. శనివారం ఉదయం 8గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి వీర తిలకం దిద్ది పూల మాలలు వేసి దీక్షలో కూర్చోబెట్టారు.
ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష సాగనుండగా, శనివారం రాత్రి అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ‘జై కేసీఆర్’ ‘జైజై కేసీఆర్’ అంటూ జైకొట్టారు. కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినదించారు. ‘రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’ నినాదాలతో హోరెత్తించారు. కొంత మంది రైతులు తమ పొలాల్లో ఎండిన వరిని తీసుకొచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి రైతులను ఆదుకోవాలని, రైతును కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్ తక్షణమే గద్దె దిగాలని ముక్తకంఠంతో నినదించారు. కాగా, దీక్షలో అనేక సార్లు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

