మంథని రూరల్, జూలై 26: మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన రైతు దండిగా కొమురయ్య (65) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పోలీసులకు కథనం ప్రకారం.. కొమురయ్య గ్రామ శివారులోని తన పొలానికి శనివారం ఉదయం 5 గంటలకు వెళ్లాడు. ఒడ్డుపై ఉన్న కరెంట్ స్తంభం సపోర్టు వైరుకు పాలిపోయి ఉన్న మోటర్ వైరు తాకి ఉండడం, గమనించక దానికి కొమురయ్య తాకడంతో అకడికకడే మృతి చెందాడు.
భార్య గట్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొమురయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.