BASWAPUR | సిరిసిల్ల రూరల్, మార్చి 29: చింత చెట్టు పై నుంచి పడి వ్యవసాయ కూలి మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల పల్లి మండలం బస్వాపూ ర్ లో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం…గ్రామానికి చెందిన బంటు ఆనందం (45) గ్రామం లో వ్యవసాయ పనులకి కూలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమం లో శనివారం గ్రామం లో చింత చెట్టు పై చింత కాయలు తెంప దానికి వెళ్లాడు.
మధ్యాహ్నం వేళ లో చింత చెట్టు పై నుంచి ప్రమాద వ శాత్తు చెట్టుపై నుంచి జారి పడ్డాడు.ఈ ప్రమాదం లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు సిరిసిల్ల లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యుల సూచన తో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
ఆనందం కు భార్య రేణుక, కొడుకు మహేందర్ (14), కూతురు శశిల (10) ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. భార్య రేణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్మోహన్ తెలిపారు.