 
                                                            
Veenavanka | వీణవంక, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ఉత్సాహకంగా సాగింది. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి నర్సింగాపూర్ వరకు ఉదయం 7 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అనుపమరావు జెండా ఊపి ప్రారంభించారు.
కాగా యువకులు, పెద్దలు, పోలీసులు సుమారు 100 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ రన్నింగ్, వాకింగ్ జీవితంలో ఒక భాగంగా ఎంచుకొని ధృడంగా ఉండాలని, ప్రస్తుత వాతావరణం, ఆహారపు అలవాట్ల దృష్ట్యా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, వాటికి అనుగుణంగా ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, డీటీ నిజామొద్దీన్, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
 
                            