కరీంనగర్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : పంద్రాగస్టు వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంబరాన్నంటేలా జరుపుకొనేందుకు సర్వం సిద్ధమైం ది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పరేడ్ గ్రౌండ్లు, సిరిసిల్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలు నిర్వహించనున్నారు. కరీంనగర్లో మంత్రి శ్రీధర్‌బాబు, జగిత్యాలలో విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సిరిసిల్లలో విప్ ఆది శ్రీనివాస్, పెద్దపల్లిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించి, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు ప్రదానం చేసి, వివిధ శాఖల స్టాల్స్ పరిశీలిస్తారు. ఆయాచోట్ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేడుకల సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.