Veenavanka | వీణవంకలో మహాశివరాత్రి వేడుకలకు సర్వంసిద్ధం
వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో నేడు జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు ఆలయకమిటీల ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. వీణవంక మండల కేంద్రంలో వెయ్యేళ్ళ చరిత్ర కగలిగిన శివాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 14 : వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో నేడు జరుగనున్న మహాశివరాత్రి వేడుకలకు ఆలయకమిటీల ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. వీణవంక మండల కేంద్రంలో వెయ్యేళ్ళ చరిత్ర కగలిగిన శివాలయంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రముఖ వేదపండితులు గూడ జగదీశ్వరశర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయం గోపూజ, ద్వాదశ జ్యోతిర్లింగముల దర్శనము, సామూహిక మహారుద్రాభిషేకము, ఎదుర్కోళ్ళు, రాత్రి శివపార్వతుల కల్యాణం, అర్ధరాత్రి లింగోద్భవము, అనంతరం ఊంజల్ సేవా, ఆదివారం ఉదయం అన్నపూజ, మధ్యాహ్నం మహాన్నదానము, సాయంత్రం రథోత్సవము ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ రామిడి శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మండల కేంద్రంతో పాటు నర్సింగాపూర్, చల్లూరు, మామిడాలపల్లి, ఎలుబాక, వలాపూర్, పోతిరెడ్డిపల్లి, కొండపాక, రెడ్డిపల్లి, ఘన్ముక్ల గ్రామాల ఉత్సవ కమిటీ చైర్మన్లు కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

