Women Empowerment | ధర్మారం, జనవరి 2: మహిళా సాధికారత కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ కోరారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ సేవలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళా హక్కులు,ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆమె అన్నారు.
మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్న నష్టాలను ఆమె వివరించారు. అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు జరిగితే మహిళలు తమకు సమాచారం అందించాలని ఆమె సూచించారు. బాల్య వివాహా నిషేధ చట్టం 2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం చేస్తే వాటి వల్ల కలిగే మానసిక శారీరక ఆర్ధిక అనర్థాలు సంభవిస్తాయని అన్నారు.
అనంతరం అంగన్ వాడి సెంటర్ – 2లో అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దార రాజ కుమార్, పంచాయతీ సెక్రటరీ అజ్మీరా నందులాల్ నాయక్, అంగన్ వాడి అంగన్వాడీ టీచర్లు బుచ్చమ్మ, కవిత, ఏఎన్ఎం డీ అరుంధతి, ఆశ వర్కర్లు కళావతి, స్వప్న, వార్డు మెంబర్లు తిరుపతి, లక్మి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.