MLA Padi Kaushik Reddy | హుజూరాబాద్, మే 24: సభ్యత్వ నమోదులో ప్రతీ ఒక్కరూ భాగస్వామి కావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. హుజురాబాద్ పట్టణంలోని కేసీ క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్య కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతీ గ్రామం, ప్రతీ బూత్ స్థాయికి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ మండలం, జమ్మికుంట మండలం, కమలాపూర్ మండలం, వీణవంక మండలం, ఇల్లంతకుంట మండలం, హుజురాబాద్ పట్టణ, జమ్మికుంట పట్టణానికి చెందిన పార్టీ సమన్వయ కమిటీ పాల్గొన్నారు.