దుమ్ముగూడెం, జూలై 28 : దుమ్ముగూడెం మండలంలో రైతులు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఎంపీడీఓ వివేక్‌రావు, తాసీల్దార్ అశోక్‌కుమార్, ఏఓ నవీన్‌కుమార్ తెలిపారు. మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ.. నీటిని ఒడిసిపట్టే వివిధ పనుల్లో భాగంగా ఇంకుడు గుంటలు, ఊటకుంట, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచులకు సూచించారు. అలాగే మండలంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్య చర్యలను ముమ్మరంగా నిర్వహించాలని, రైతులకు స్థానిక ఏఈవోలు తగిన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ, విద్యుత్తు శాఖ ఏఈ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.