Godavarikhani | జ్యోతినగర్, మే 11: పుట్టుక నుంచి విధి వక్రీకరించి రెండు చేతులు లేకున్న.. ఆత్మస్థైర్యంతో రెండు కాళ్ళతో అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుతున్న దివ్వాంగుడైన విద్యార్థి ముత్తారం బాలాజీ శభాష్ అనిపించుకుంటున్నాడు. రోజువారి దినచర్యల్లో ఇంట్లో మనం చేసుకునే పనులకు ఏ మాత్రం తీసిపోకుండా తన పనులను తానే చేసుకుంటాడు. తోటి విద్యార్థులు తరగతిగదిలో చెయ్యితో పెన్ను పట్టి రాయిస్తే బాలాజీ తన కాళ్ళతో పెన్ను పట్టుకోని రాస్తాడు. అన్ని అవయవాలు ఉన్న చిన్నచిన్న పనులకు కూడ తల్లిదండ్రులు, ఇతరులపై ఆధారపడుతున్న నేటి విద్యార్థులకు బాలాజీ కాళ్ళతో పనులు చేసుకుంటు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వివరాల్లోకి వెళ్లితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండల కేంద్రంలోని జీరో పాయింట్ కాలనీకి చెందిన ముత్తారం శ్రీనివాస్ తిరుమల దంపతుల ఐదుగురు సంతానంలో పెద్ద కొడుకు బాలాజీ పుట్టుకతో రెండు చేతులు లేవు. ముగ్గురు బిడ్డలు ఇంజినీరింగ్‌కు చదవువగా, చిన్న కొడుకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. వీరి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు దొరికిన పనిచేసుకుంటూ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో మంచిగా చదివించినప్పటికి బాలాజీకి రెండు చేతులు లేకపోవడం అ ఇంట్లో విషాదం నింపిన ఆ ధైర్యపడకుండా తల్లిదండ్రులు బాలాజీని ఎన్టీపీసీలోని ట్రినిటీ డిగ్రీ కళాశాలలో బికాం సీఏ కంప్యూటర్ చదివిస్తున్నారు. చదువులో బాలజీ తోటి విద్యార్థులతో సమానంగా మార్కులు తెచ్చుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు.దివ్యాంగులకు జీవితం భారమైనప్పటికి బాలాజీ మాత్రం చిన్నతనం నుంచి చేతులతో చేసే పనులను కాళ్ళతో చేసుకోవడంకు అలవాటు పడ్డాడు.
చదువుపట్ల నిరక్ష్యం చేయకుండా పట్టుదలతో చదువులో రాణిస్తున్నాడు. కాళ్ళతో బుక్, పెన్ను పట్టి సునాయసంగా రాస్తాడు. అలాగే ల్యాప్‌టాప్, • సెల్‌ఫోన్‌ను కూడ కాలి వెళ్ళతో ఆపరేటింగ్ చేయడంలాంటి టాలెంట్ కలిగిన బాలాజీ కంప్యూటర్లో టెక్నికల్ స్కిల్స్‌తో ప్రావీణ్యంతో కంప్యూటర్లో పీజీడీసీఏ, బ్రాడ్ బ్యాండ్ టెక్నికల్ వర్కు, డేటాబేస్ సైన్స్ కోర్సును పూర్తి చేశాడు. తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి నేపధ్యంలో ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వ కొలువు కోసం పోటీ పరీక్షలకు కూడ హజరవుతున్నాడు. దివ్యాంగుడితో నేటి పోటీ ప్రపంచంలో బాలాజీకి ప్రభుత్వ కొలువు అందనంత దూరంలో ఉందని బాధపడుతున్నాడు. విధి వంచిన బాలాజీకి ఆలనా, పాలనతో మిగితా బిడ్డలను చదివించడం, ఇంటి పోషణంకు కష్టతరమవుతోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
నా బిడ్డకు ఉపాధి చూపించండి.. : తిరుమల, బాలాజీ తల్లి
అన్ని పనులు చేసుకుంటున్న నా బిడ్డకు ప్రభుత్వం ఉపాధి కల్పించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నాం. పిల్లలు పెద్దవారు కావడంతో ఇల్లు గడువడం కష్టంగా ఉంది. నా బిడ్డకు ప్రభుత్వం జిల్లాలో స్థానికంగా ఏదైనా ప్రభుత్వ ఆఫీస్‌లో వాడికి తగిన కొలువు ఇచ్చి మా కుటుంబాన్ని అదుకోవాలని కోరుతున్నా