Dharmaram | ధర్మారం, అక్టోబర్ 30: ఆల్ ఇండియా బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఎర్రం సంజీవ్ నియమితులయ్యారు. సంజీవ్ కు గురువారం హైదరాబాద్ లో నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త విజయ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రం సంజీవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి కి, హక్కుల సాధన కోసం,మంచి సమాజ నిర్మాణానికి, అన్యాయాల పై పోరాటం చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో డోంగ్లి శ్రీనివాస్, బెల్లంకొండ జ్యోతి గౌడ్, కొత్వాల్ సంతోష, షేక్ ఎజాజ్ పాషా, మంద ఆనంద్ మురళి, కాకుమాను మెర్సీ జ్యోతి, గంజి శశి కుమారి, పోలంకి జగదీష్ కుమార్, బాణాల ప్రేమలత, పోలంకి ఉషారాణి, మంద లావణ్య తదితరులు పాల్గొన్నారు.