Model Schools Principals Association | ధర్మారం, సెప్టెంబర్ 25 : రాష్ట్ర తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈనెల 23న హైదరాబాద్ లో జరిగిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ల సమావేశం నిర్వహించగా రాష్ట్రంలోని దాదాపు 90 కి పైగా మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు హాజరైనారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ల సంఘం రాష్ట్ర కమిటీ ని ఎన్నుకున్నారు.
ధర్మారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ కు 12 సంవత్సరాల అనుభవం ఉండడంతో అతడిని రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ప్రిన్సిపాళ్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల అభివృద్ధికి మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ను టీపీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్, ధర్మారం మోడల్ పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.