Drugs | చిగురుమామిడి, మే 7: డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలం లో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించారు. జేఏసీ నాయకులు గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్ధాలు, లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు, నూతన జీవితాలను ప్రారంభించే యువతక ఈ డ్రగ్స్ ను అంటిపెట్టుకొని రేపటి దేశానికి పాలకులుగా ,ఉద్యోగులుగా ,రాజకీయనాయకులుగా ,పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన యువత అర్ధాంతరంగా చనిపోవడం కుటుంబాలలో కడువిషాదాన్ని నింపుతున్నాయన్నారు.
పెళ్లి చేసుకున్న స్త్రీలు చిన్నవయసులోనే వితంతువులుగా మిగిలి పోవడం సమాజాన్ని పట్టిపీడిస్తుందన్నారు. డ్రగ్స్ తీసుకొని ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా కృంగిపోవడం ఈ దేశానికి మంచిది కాదు. ఒకవైపు దేశానికి పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో యుద్ధం పొంచి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన యువత మత్తుకు బానిసలై చనిపోవడం దేశ శక్తిని కోల్పోతున్నాం అని అన్నారు, పోలీస్, నార్కోటిక్,ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికి ఇంకా విజృంభించి పల్లెలు దాకా వచ్చిందన్నారు.
సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకతీతంగా ఏకమై డ్రగ్స్ నీ నిర్మూలించినప్పుడే యువత ను కాపాడుకున్న అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, నియోజకవర్గం కో ఆర్డినేటర్ డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్, లోడీ సంస్థ ప్రతినిధులు ఉప్పుల కుమారస్వామి,గాండ్ల పద్మ,జేఏసీ బాధ్యులు డాక్టర్ ఎదులపురం తిరుపతి, వేముల జగదీష్, తాళ్లపల్లి జగన్, తాళ్లపల్లి ప్రభాకర్, ఎర్ర కార్తీక్, సెర్ప్ (ఐకెపి) సీసీ గంప సంపత్, పంచాయతీ కార్యదర్శిలు గాజుల శ్రీలక్ష్మి, అమృత వర్షిని, జగన్ గౌడ్, రమేష్, లక్ష్మారెడ్డి, అచ్చ రవి, వంగర మల్లేశం, రాజేశం, బాబు, వేణు, వెంకటేశం, లత, మంజుల, సత్తయ్య, ప్రేమలత, సుజాత తదితరులు పాల్గొన్నారు.