Environmental protection | ఓదెల, సెప్టెంబర్ 14 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వారిని సదాశయ ఫౌండేషన్ వారు ఆదివారం గ్రీన్ గణపతి అవార్డు అందజేశారు. సదాశయా ఫౌండేషన్, పోత్కపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ గణపతి అవార్డ్స్ కార్యక్రమం సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవడంతో పాటు, సమాజ హితమైన కార్యక్రమాలు, భక్తి భావన కలిగి ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా మండలంలోని 22 గ్రామాల గణపతి మండపాల ఇన్చార్జిలకు అవార్డ్స్ ఇచ్చారు. మండలంలోని ఓదెల హనుమాన్ నగర్ కు చెందిన వినాయకుడికి ఉత్తమ గణపతి గా పేర్కొన్నారు. ఇందులో ఎస్సై రమేష్ , పోలీస్ సిబ్బంది పర్యావరణ హితానికి కృషి చేసిన వారికి సన్మానం చేశారు.
కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మేర్గు భీష్మాచారి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, కొండ్ర వేణు, క్యాతం మల్లేశం, మెరుగు సారంగం, ఇప్పలపల్లి వెంకటేశ్వర్లు, మేర్గు నాగరాజు, బైరి సాయినాథ్, క్యాతం విజయసారథి, శాతాల కుమార్, దాత రాకేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిని సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ అభినందించారు.