Jeevan Reddy | జగిత్యాల, జూన్ 8 : జగిత్యాల అర్బన్, రూరల్ మండల పరిధిలో చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవన్ రెడ్డి ప్రజావాణిలో ఆర్డీఓ మధుసూదన్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెరువులు, కుంటలు ప్రధానమైన అంశమని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులు, కుంటలు ఎక్కడా ఆక్రమణకు గురైన కానీ ఆక్రమణలను తొలగింప చేసి చెరువులను పునరుద్దింపజేయడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వచ్చేసరికి మోతే చెరువు, ముప్పారపు చెరువు, జగిత్యాల పట్టణ సరిహద్దులో ఉన్నాయి. పట్టణ సరిహద్దుల్లో ఉండడంతోని పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయని తెలిపారు.
చెరువులను మట్టితో నింపేయడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని, దీనివల్ల భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చేపల వృత్తిలో ఉన్న మత్స్య కార్మికులు వారి వృత్తికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. మోతే గ్రామంలోని ముప్పారపు చెరువు సంబంధించి పలు పర్యాయాలు కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయాలని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణ చేయడంతో పాటుగా వాటి పరిధి లోపల మట్టితో నింపిన ఆక్రమణలు తొలగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల సరిహద్దుల్లో ఉన్న ముప్పారపు చెరువు, తిమ్మాపూర్, రఘురాములకోట, తిప్పన్నపేట, చెరువుల ఆక్రమణలను తొలగించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారించాలన్నారు. అలాగే సారంగాపూర్ మండలానికి సంబంధించి నాగులకుంటా మత్స్య సహకార సంఘ సభ్యులు వీరు సమాజంలో అధిక జనాభా ముదిరాజులేదనని, వారి సమస్యను పరిష్కరించాలని ఆర్డీవోను విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట నాయకులు పాల్గొన్నారు.