Gangadhara | గంగాధర, ఆగస్టు 28: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాము సూచించారు. మండలంలోని గర్షకుర్తిలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు.