నిలిచిన ఈవీ బస్సులు.. ప్రయాణికుల పాట్లు
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు గాశారు. ఈవీ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డిపో-2 చెందిన 140 ఈవీ బస్సులను నిలివేశారు.
- కరీంనగర్లో డిపో-2కే పరిమితమైన ఎలక్ట్రిక్ వాహనాలు
- సమయానికి బస్సుల్లేక పడిగాపులు
కరీంనగర్ తెలంగాణచౌక్, జూలై 3: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు గాశారు. ఈవీ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డిపో-2 చెందిన 140 ఈవీ బస్సులను నిలివేశారు. దీంతో ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
వరంగల్, నిజామాబాద్, గోదావరిఖని, జగిత్యాల పట్టణ ప్రాంతాలకు ఇతర డిపోల నుంచి తీసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్‌లను వేశారు. జమ్మికుంట, బెజ్జంకి, హుస్నాబాద్, వేములవాడ, ధర్మారం, గ్రామీణ పాంత్రాలకు పల్లె వెలుగు బస్సులను అదనంగా నడిపించారు. అయితే ఈవీ బస్సులు డిపోకే పరిమిత కావడం, ఆ రూట్లలో అదనంగా బస్సలను తిప్పినా సమయానికి బస్సుల్లేక ప్రయాణికులు అవస్థలుపడ్డారు.
వరంగల్ నుంచి నిజామాబాద్‌కు కొన్ని ఈవీ బస్సులను నడిపించడం, కరీంనగర్లో నిలిపివేయడంతో ఆగ్రహించారు. కాగా, ఈవీ బస్‌ల ప్రమాదాలకు సంబంధించి నివేదిక వచ్చిన తర్వాతే ఈవీ బస్సుల పునరుద్ధరణ పై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

