DCP Bhukya Ramireddy | కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 28 : సర్పంచి ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ భూక్యా రామిరెడ్డి ప్రజలకు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాలను శుక్రవారం ఏసీబీ గజ్జి కృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామంలో జరిగే ప్రథమ పౌరుడి ఎన్నికల్లో యువత గ్రామస్తులు శాంతియుతంగా పాల్గొని ఇలాంటి గొడవలకు తావు లేకుండా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు.
గొడవలు పడి కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరగొద్దని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేష్, ఏఎస్సై నీలిమ, సిబ్బంది పాల్గొన్నారు.