Elections | గన్నేరువరం, డిసెంబర్ 8 : శాంతియుత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఎస్సై నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మండలంలోని గునుకుల కొండాపూర్, గుండ్లపల్లి గ్రామాలలో ప్రత్యేక బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై జీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రచారం నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ సాగర్ ,పోలీస్ బెటాలియన్, సిబ్బంది పాల్గొన్నారు.