UltraTech Cement plant | అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలి.. కార్మికుల డిమాండ్
పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం పర్మినెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఆవరణలో కార్మికులు వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం నిరసన చేపట్టారు.
UltraTech Cement plant | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం పర్మినెంట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కర్మాగారం ఆవరణలో కార్మికులు వివిధ కార్మిక సంఘాల నాయకులు శనివారం నిరసన చేపట్టారు. ఉదయం జనరల్ షిఫ్ట్ కార్మికులతో కలిసి కర్మాగారం ఎదుట ధర్నా చేపట్టారు. గత నెల రోజులుగా కార్మిక సంఘం ఎన్నికల కోసం ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కోరినప్పటికిని యాజమాన్యము ప్రస్తుతం ఉన్న యూనియన్ నాయకులు కుమ్ముకై తమ ఎన్నికలను తరచు వాయిదా వేస్తున్నారని ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు .
కర్మాగారంలో పాతుకుపోయిన కార్మిక సంఘం నాయకులు ఎన్నికలు సజావుగా సరియైన సమయంలో పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇప్పటికే కార్మికులు పలు డిమాండ్లు నష్టపోయారని ఇంకా ఎన్నికలు కాలయాపన చేయడం మూలంగా కార్మికులకు అనేక హక్కులు హరించుకుపోతాయని వారు పేర్కొన్నారు . సత్వరమే ఎన్నికల షెడ్యూలు విడుదల చేసి కార్మికుల గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు . ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు మల్కా రామస్వామి, నల్ల మనోహర్ రెడ్డి , పిట్లగోపాల్ , రమేష్ మౌర్య , తంగడ అనిల్ రావు , ఆడెపు శ్రీనివాస్, అంజి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

