Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 1 : వేములవాడ పట్టణ శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా దర్ర మల్లేశం, ఉపాధ్యక్షుడిగా మామిండ్ల బాలయ్య, కోశాధికారిగా మారవేణి మల్లయ్య, సలహాదారులుగా మామిండ్ల పెద్ద గంగయ్య, ఎక్కల దేవి గంగయ్య ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దర్ర మల్లేశం మాట్లాడుతూ సంఘాన్ని మరింత బలోపేతం చేసి, యాదవుల ఐక్యత, సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.