Retired Employees Association | ధర్మారం, అక్టోబర్18: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ధర్మారం, వెల్గటూర్, ఎండపల్లి మండలాల టి జి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక పెన్షనర్ల భవన్ లో జరిగిన సంఘం నూతన కమిటీ ఎన్నిక కోసం సుమారు 70 మంది రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు. సంఘం ప్రస్తుత అధ్యక్షుడు లింగాల మురళీధర్ రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఈ ఎన్నిక కార్యక్రమాన్ని సంఘం జిల్లా అధ్యక్షుడు సి జీవన్ రాజు నేతృత్వంలో నిర్వహించగా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రామరాజు ఎన్నికల అధికారిగా ,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పులి హనుమాండ్లు, జిల్లా కార్యదర్శి ఏ ఉమా రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గౌరీ ఎల్లయ్య ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు. సంఘం నూతన కమిటీ అధ్యక్షునిగా రెండవసారి లింగాల మురళీధర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా ఇస్లావత్ ఉపేందర్ నాయక్, కోశాధికారిగా గంధం రాజయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఆర్ భద్రయ్య, ఉపాధ్యక్షులుగా ఎస్ బంగారయ్య, జి జంగమ్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎస్ కొమురయ్య, బి లక్ష్మి, ప్రచార కార్యదర్శిగా బోయినపల్లి గంగారం, కార్యవర్గ సభ్యులు ఎన్నికైనట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్ రాజు ప్రకటించారు. ఈ కార్యవర్గం మూడు సంవత్సరాల పాటు ఉంటుందని ఆయన తెలిపారు.