ఇంటింటికీ ఓటరు గైడ్
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు నమోదును పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపడుతున్నది. యువ ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన పౌరులందరినీ పోలింగ్ బూత్‌వైపు నడిపించేందుకు పలు చైతన్య కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
- వంద శాతం ఓటింగే లక్ష్యంగా రూపకల్పన
- ఓటేసే పద్ధతి, బూత్‌లో కల్పిస్తున్న సౌకర్యాలతో ముద్రణ
- బీఎల్వోల ద్వారా పంపిణీ
ఓటింగ్ శాతం పెంపునకు వినూత్న విధానాలతో ముందుకెళ్తున్న ఎన్నికల కమిషన్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఓటేసే పద్ధతిపై అవగాహన కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా కొత్తగా ఓటర్గైడ్ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన బుక్‌లెట్‌ను ఇటీవలే విడుదల చేసింది. త్వరలోనే బీఎల్వోల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 9 : పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు నమోదును పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపడుతున్నది. యువ ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన పౌరులందరినీ పోలింగ్ బూత్‌వైపు నడిపించేందుకు పలు చైతన్య కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, కళాబృందాలు, సినిమా థియేటర్లలో అడ్వర్టైజ్మెంట్లు, సోషల్ మీడి యా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. ఈ యేడు ఇందుకు భిన్నంగా 100 శా తం ఓటిం గ్ లక్ష్యంగా కొత్త విధానమైన ఓటరు గైడ్‌కు రూపకల్పన చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని నిశ్చయించింది.
గైడ్లో ఏమున్నది
16 పేజీలతో కూడిన ఓటరు గైడ్లో ఓటు వినియోగంపై అవగాహనకు అంశాలను అందులో చేర్చింది. ఓటు రిజిస్ట్రేషన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేర్ల పరిశీలన. పోలింగ్ రోజున అనుసరించాల్సిన పద్ధతులు, పోలింగ్ స్టేషన్‌ను గుర్తిం చి, పోలింగ్ బూత్‌లోకి వెళ్లాల్సిన తీరు, ఓటు వేసేందుకు సంబంధిత అధికారులకు చూ పాల్సిన గుర్తింపు కార్డుల వివరాలు, ఓటు వేసే విధానంపై అవసరమైన సమాచారం పొందుపర్చారు.
అలాగే, ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్లు గుర్తించినా, సమాచారం అందినా, బాధ్యత గల పౌరుడిగా ఈసీకి ఫిర్యా దు చేసేందుకు పలు సంకేతాలతో కూడిన ఆన్లైన్ యాప్‌ల వివరాలు కూడా బుక్‌లెట్‌లో చేర్చింది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపే దివ్యాంగు లు, సీనియర్ సిటిజన్ల కోసం కల్పించిన సౌకర్యా లు ర్యాంప్, వీల్‌చైర్, బ్రెయిలీ లిపితో కూడిన ఈవీఎంలు, ప్రత్యేక వలంటీరు, రవాణా సదుపాయాలు, ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం, పోస్ట ల్ బ్యాలెట్ విధానంతోపాటు ఓటర్ల ప్రతిజ్ఞ కూ డా ముద్రించారు. వీటిని నోటిఫికేషన్‌కు ముందే ప్రతి ఇంటికీ చేర్చేలా బూత్‌స్థాయి అధికారుల ద్వారా పంపిణీ చేయనున్నామని లోక్‌సభ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కే మహేశ్వర్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

