ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేయాలి
క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి సక్రమంగా అమలయ్యేలా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
- నూతన పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి
- కమిషనరేట్ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
- పోలీస్ అధికారులతో సమీక్ష
రాంనగర్, అక్టోబర్ 31: క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి సక్రమంగా అమలయ్యేలా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున పాటించాల్సిన నియమాలు, చేపట్టే విధుల గురించి పలు సూచనలు చేశారు. జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై, ఎన్నికల వేళ గొడవలు సృష్టించే వ్యక్తులపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నియమావళిని అమలు చేయాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

