అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
తాను స్థానికుడినని, అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేశానని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తనను ఆదరించి కారుగుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు.
- మరోసారి అవకాశమిస్తే సిరిసిల్ల తరహాలో చొప్పదండిని తీర్చిదిద్దుతా
- పట్టణంలో పన్నులు తగ్గిస్తాం
- బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- పలు వార్డుల్లో ఇంటింటా ప్రచారం
చొప్పదండి, నవంబర్ 28 : తాను స్థానికుడినని, అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేశానని, ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తనను ఆదరించి కారుగుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలని చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. చొప్పదండి పట్టణంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార, వాణిజ్య, గృహాలపై విధిస్తున్న పన్నులను తగ్గిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం చొప్పదండి పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
తాను నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తన స్వగ్రామమైన బూరుగుపల్లిలోనే ఉంటున్నాని, ఎక్కడుంటాడో తెలువని హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రమాదముందని, ప్రజలు గమనించాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని రూ.130 కోట్లతో అభివృద్ధి చేస్తున్నానని, మరోసారి తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే సిరిసిల్ల తరహాలో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి-సాంబయ్య, కౌన్సిలర్లు నలుమాచు జ్యోతి-రామక్రిష్ణ, కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్‌చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, కౌన్సిలర్ అజ్జు, నాయకులు మహేశుని మల్లేశం, జహీర్, మావురం మహేశ్, ఖాజా పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

