Peddapally | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 22 : పెద్దపల్లి మండలం నిట్టూరులో 2 వార్డు సభ్యుడిగా గెలుపొందిన నీలం లక్ష్మణ్ అక్కడ ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి ప్యానల్ గెలిచిన అభ్యర్థి కావడంతో తనకే ఉపసర్పంచ్ పదవి కావాలని డిమాండ్ తీసుకువచ్చారు. దీంతో ఆ సమయంలో ఇరువర్గాలకు చెందిన మెజారిటీ వార్డు సభ్యుల సమ్మతంతో నిట్టూరు ఉపసర్పంచ్ గా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అటు గెలిచిన సర్పంచ్ ఆకుల సువర్ణ, ఇటు వార్డు సభ్యుల సమ్మతంతో గెలిచిన ఉపసర్పంచ్ గా నీలం లక్ష్మణ్‌కు ఎన్నికైన ధృవీకరణ పత్రాలను అందజేశారు.
కానీ ఎన్నికైన వారం తిరగక ముందే మంచి ముహూర్తం పేరుతో సోమవారానికి సర్పంచ్ పాలక వర్గాల ప్రమాణస్వీకారం వాయిదా వేయడం సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంది. కాగా ఉపసర్పంచ్ గా ఎన్నికైన 2 వ వార్డు సభ్యుడు నీలం లక్ష్మణ్‌తో పాటు మరో వార్డు (10) ఇద్దరు ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడం నిట్టూరుతో పాటు పెద్దపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.
ఏది ఏమైనా నిట్టూరు గ్రామంలో బీఆర్ఎస్ వర్సస్ కాంగ్రెస్ పోరు రసవత్తరంగా సాగుతుందనే చర్చ ఒక వైపు సాగుతోంది. దీంతో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సర్పంచ్ బీసీ వర్గం కావడం ఓటమి పాలైన అభ్యర్థి వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి వెనుక ఎవరైనా బలమైన నాయకులు ఉండే రాజకీయ సమీకరణాలు చేస్తున్నారేమో అన్న చర్చకూడా జోరుగా సాగుతోంది.