Pigs attack | చిగురుమామిడి, ఆగస్టు 10: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో దుడ్డేల పోచమ్మ వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న వృద్ధురాలు కిరాణా షాప్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పందులు ఒకేసారి దాడి చేయడంతో పోచమ్మకు గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు, కుటుంబీకులు ఆమెను వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కోతుల బెడద తట్టుకోలేకపోతున్నామని, దానికి తోడు పందుల బెడద ఎక్కువైందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.