Odela | ఓదెల, డిసెంబర్ 29 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూ వివాదంపై గొడవ తలెత్తింది. ఈ గొడవలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కనగర్తి గ్రామంలో ఆది రాజయ్య(70) అనే వ్యక్తికి ఆయన వ్యవసాయ భూమి పక్క మరో వ్యక్తికి సంబంధించి సరిహద్దు విషయంలో మరో వ్యక్తి అయిన ఆది రాజయ్య గొడవ పడినట్లు తెలిసింది.
ఒకరికి ఒకరు తోసుకోవడంతో ఆదిరాజయ్య అనే వృద్ధుడు కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేసు పరిశీలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.