cooperative societies | సుల్తానాబాద్ రూరల్, జూలై 8: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం-2025లో భాగంగా పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని దేవునిపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ఆరో వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పంపు ఆవరణలో మొక్కలు నాటారు. ఐఓసీ కంపెనీ ద్వారా పెట్రోల్ డీజిల్ పోసుకున్నవారికి న్యూ ఇయర్ ధమాకా ఆఫర్ లో భాగంగా 9 మంది ఖాతాదారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ దేవర నేను మోహన్ రావు, వైస్ చైర్మన్ కందుల రాజు, కేడీసీసీ సీఈఓ సత్యనారాయణ, ఐఓసీ కంపెనీ సూపర్వైజర్ ఆకాష్ , కేడీసీసీ బ్యాంకు మేనేజర్ శశిధర్ రావు, అసిస్టెంట్ రిజిస్టర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, బ్యాంకు సూపర్వైజర్ శమీ, సీఈఓ వల్ల కొండ రమేష్, మాధవరావు, లింగయ్య, సత్తయ్య, వీరయ్య , నిర్మల, విజయతో పాటు పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.