MLA Dr. Sanjay Kumar | సారంగాపూర్, జనవరి 1: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గురువారం భూమిపూజ నిర్వహించారు. గ్రామంలో నూతన పంచాయతీ భవన నిర్మాణాకి అనువైన స్థలం లేకపోవడంతో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు గ్రామ పంచాయతీ భవన నిర్మానాణాకి పావు తక్కువ రెండు గుంటల స్థలాన్ని అఫిడవిట్ రూపంలో డీఈ మిలింద్ కు పత్రాలను అందించారు.
గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు రాజగోపాల్ రావు ను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రావును పులమాలతో సన్మానించి అభినందించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ మాజీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఎడ్ల సృజన సుశీన్, చిక్రం మారుతి, బోడ సాగర్, మసీదు తిరుపతి, హరీష్, శీలం లింగన్న, ఆడెపు తిరుపతి, రవి, నారపాక రమేష్, గంగాధర్, రమేష్, ఎలగందుల ఆశోక్, ఆయా గ్రామాల ప్రజాప్రతి నిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.