MLA Chinthakunta Vijayaramana Rao | పెద్దపల్లి,అక్టోబర్5:పెద్దపల్లి నియోజక వర్గంలోని వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్‌క్లబ్ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు.
ప్రభుత్వం నుంచి జర్నలిస్టులకు అందాల్సిన పథకాలను పారదర్శకంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.అనంతరం
కొత్తగా ఎన్నికైన క్లబ్ కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించారు.
కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, సినీయర్ న్యాయవాది ఉప్పురాజు, నాయకులు భూతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, అమెరిశెట్టి సతీష్, లైశెట్టి బిక్షపతి, సీనియర్ జర్నలిస్టులు కొట్టె సదానందం, రాజేందర్, అంకరి ప్రకాష్, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి గోపాల్, కోశాధికారి ఆరెల్లి మల్లేశ్, ఉపాధ్యక్షులు తిర్రి తిరుపతి గౌడ్, బెజ్జంకి నరేశ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జంగిలి రాజు యాదవ్, సహాయ కార్యదర్శులు అరుకుట మల్లేశ్ యాదవ్, కత్తెర్ల తిరుపతి యాదవ్, అనకట్ల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు తిర్రి సుధాకర్ గౌడ్, మర్రి సతీష్ రెడ్డి, కొయ్యడ తిరుపతి, మాచర్ల వంశీ కృష్ణ, తూర్పాటి శ్రీనివాస్, నగునూరి శ్రీనివాస్, సాబీర్ పాషా, సంకె రాజు, నాగిశెట్టి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.