MLA Dr. Sanjay Kumar | జగిత్యాల, మే 28: జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో 25, 26వ వార్డులో రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధి లకి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్క అధికారి, నాయకులు, ప్రజలు బాధ్యతతో పని చేయాలన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో జగిత్యాల డబల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక సదుపాయాలు కల్పనకు 34 కోట్లను, 40 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, 14 జోన్లు 126 సర్వే నంబర్ లు మార్చడం జరిగిందని, చట్ట బద్దంగా అనుమతులు వస్తున్నాయని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పచ్చదనం, పారిశుధ్యం ముఖ్యమని, మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలనీ సూచించారు.
ప్రజలు ప్లాస్టిక్‌ను తక్కువ వాడడం, తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని, లే అవుట్ ప్రకారం ప్రజలు నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన,బి మున్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరినాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఆరుముల్ల పవన్, షకీల్, చిక్కుల భూమయ్య, డిఈ నాగేశ్వర్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, ఏఈ శరన్, టిపిఓ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, పట్టణ, ఆయా వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.