Saidapur | సైదాపూర్ : సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో రైతులు కరంట్ కోతలకు నిరసనగా సీఎం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు దిష్టిబొమ్మతో గ్రామంలో ర్యాలీ చేసి ప్రధాన కూడలిలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిత్యం విద్యుత్ కోతలతో పంటపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతాంగానికి 15 గంటల పాటు కరంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సైదాపూర్ విద్యుత్ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పైడాకుల శ్రీనివాస్, వేమునూరి రమేష్, రాజు, మహేందర్, తిరుపతి రెడ్డి, రాంరెడ్డి, గౌరయ్య, రాజి రెడ్డి, క్రాంతి కుమార్, జయేందర్, రాజేందర్, ఎల్లయ్య, వేణుప్రకాశ్ రెడ్డి, రవీందర్ రెడ్డి , తిరుపతి, మహేందర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.