Huzurabad | విద్యతోనే మనిషి జీవితంలో వెలుగు.. డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ
విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు.
Huzurabad | హుజూరాబాద్ రూరల్, ఫిబ్రవరి 8 : విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు. హుజురాబాద్ మండలంలోని రంగాపూర్ గ్రామంలో చమక్ ఫౌండేషన్, హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మహమ్మద్ అజీమ్ అలీ మాట్లాడుతూ రూ.లక్షల విలువైన పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు. నేటి సమాజంలో గ్రంధాలయాల ఏర్పాటు చాలా ఆవశ్యకమని, నేటి డిజిటల్ ప్రపంచంలో పిల్లలు నుంచి వృద్ధుల వరకు పుస్తక పఠనం తగ్గిపోయి సామాజిక మాధ్యమాలు, డిజిటల్ స్క్రీన్‌కి అలవాటు పడడంతో అవి ఒక వ్యసనంగా మారిందని పేర్కొన్నారు. పుస్తక పఠనం తగ్గిపోవడం వల్ల సృజనాత్మకత, విజ్ఞానం, సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన తగ్గిందని చెప్పారు. విద్యార్థులు అందరూ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ, పుస్తకాలను పఠిస్తూ మంచి విద్యావంతులుగా ఎదగాలని కోరారు.
గ్రామ సర్పంచ్ అరుణ మాట్లాడుతూ చమక్ ఫౌండేషన్, హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని ప్రారంభించడం మంచి శుభ పరిణామం అన్నారు. నేటి యువత విద్యార్థులు సావిత్రిబా పూలే , అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి మహానీయులను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.
హిల్ టాప్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ తౌటం సునీల్ మాట్లాడుతూ విద్యార్థులు. యువత తమ విజ్ఞానాన్ని తరగతి గదులకే పరిమితం చేయకుండా పుస్తకాలని పటిస్తూ సమాజంలో ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించడానికి కృషి చేస్తూ గొప్ప విద్యావంతులుగా ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బండి నరేష్. గ్రామస్తులు. విద్యార్థులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

