తెలంగాణచౌక్, డిసెంబర్ 21: కేంద్ర ప్రభుత్వంలో అధికారం కొనసాగిస్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక సీబీఐ,ఈడీ.ఐటీ దాడులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నదని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతం మండిపడ్డారు. కరీంనగర్‌లోని ప్రతిమ హోటల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోడీ అధికారం చేపట్టినాటి నుంచి దేశంలో అరాచక పాలన నడుస్తున్నదని, ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లఘస్తూ మోడీ, అమిత్‌షా అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార దాహంతో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చాలని కుట్రలు చేస్తున్నదన్నారు.
దేశ సంపదను అదానీకి అప్పన్నంగా అప్పగిస్తూ లక్షల కోట్ల వ్యాపారంలో అమిత్ షా భాగస్వామిగా ఉన్నాడన్నారు. అదాని అక్రమంగా చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి మోడీ, అమిత్‌షా మద్దతు ఇస్తారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో దళిత గిరిజన బిడ్డల మీద నిత్వం లైంగిక దాడులకు పాల్పతున్నారని, ప్రశ్నించే వారిపై పోలీసులతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ సీఎం, మంత్రులు వేల కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నా వారిపై ఈడీ, ఐటీ దాడులు ఎందుకు చేస్తలేరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో టూవీలర్ పై తిరిగిన బండి సంజయ్ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడిగా పదవులు రాగానే మూడేండ్లలో వెయ్యి కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. వ్యాపారులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
వెయ్యి కోట్లను ఆక్రమంగా సంపాందించిన బండి సంజయ్ మీద ఈడీ, ఐటీ దాడుల ఎందుకు చేయడం లేదన్నారు. కేంద్ర సంస్థలు ధర్మంగా, న్యాయబద్దంగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. తెలంగాణ ఆడ బిడ్డ ఎమ్మెల్సీ కవిత మీద కక్ష సాధింపులో భాగంగానే ఈడీ విచారణ చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజ్యాంగ పరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను బీజేపీ నిర్వీర్యం చేస్తున్నదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న అరాచకాలను ఎదుర్కోవడం కోసం చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో రెండు రోజల పాటు భారత రాజ్యాంగ – శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర, దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకుండా చేస్తామని హెచ్చారించారు. రెండు రోజు శిక్షణ తరుగతుల్లో మేధావులు, ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వర్కిం గ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాదాసి ప్రభాకర్ పాల్గొన్నారు.