Godavarikhani | గోదావరిఖని : సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల సెక్టర్–2లో (ఫ్లోరా అండ్ పౌన నేచర్ క్లబ్) ఆధ్వర్యంలో శుక్రవారం ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాల తయారీ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో 105 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మట్టి, పసుపు పిండి తదితర సహజ పదార్థాలతో విద్యార్థులు వివిధ ఆకృతుల్లో గణేశ విగ్రహాలను తయారు చేసి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం ద్వారా ప్రకృతి పరిరక్షణపై తమకున్న బాధ్యతను చాటారు.
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు, సహజ వనరుల సంరక్షణ ఆవశ్యకతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ గణేశ విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో పోటీ విజయవంతంగా నిర్వహించారు.