Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 22: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రామగుండం మండల (తూర్పు) క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరిఖని జీఎం కాలనీ క్రీడా మైదానంలో మండల విద్యాధికారి జింక మల్లేశం ముఖ్యతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, ఆటల్లో చురుకుదనంతో మెదడు ఉత్తేజితమై చదువులో కూడా రాణిస్తారన్నారు.
ఈ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. 2030 నాటికి భారతదేశం ఒలంపిక్స్ లో పథకాలు సాధిస్తుందన్నారు. అనంతరం జరిగిన వివిధ క్రీడల్లో సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొని నైపుణ్యతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, మండల కన్వీనర్ రమాదేవి, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుణ తిరుపతి, సత్యం, శేఖర్, వినోద్, రమేష్, ధనలక్ష్మీ, అంజలి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.