Early Sankranti celebrations | సారంగాపూర్, జనవరి 11: సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పెంబట్ల గ్రామంలో 102 ఆర్యవైశ్య గోత్రా స్థంబాలతో నిర్మాణం చేస్తున్న శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి ఆలయ ఆవరణలో ఆదివారం ఆలయ నిర్వహకులు మహిళలకు ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులు చేశారు. న్యాయ నిర్ణేతలుగా జగిత్యాలకు చెందిన పిప్పం అనిత, ఉపాద్యాయురాలు కోటగిరి రజితలు పాల్గొని విజేతలను ప్రకటించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వహకులు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు మర్యాల రాజన్న, యాశాల మల్లికార్జున్, వావిలాల శేఖర్, గుండ సురేష్, పాత రమేష్, గంప శ్రీనివాస్, హరీష్, శ్రీనివాస్, ఆర్యవైశ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.