Harish Rao | హుజురాబాద్ రూరల్, మార్చి 22 : సిద్దిపేటలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ఈ ఆయిల్ ఫామ్ అనేది మాజీ మంత్రి హరీష్ రావు కృషివల్లే నిర్మాణం జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొనగంటి శ్రావణ్ కుమార్ అన్నారు. ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. హరీష్ రావు కృషి ఫలితంగా ఏర్పాటైన ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడమంటే అది ఏంటో ఆలోచించాలన్నారు. పామాయిల్ మొక్కలను పెంచేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో స్వయంగా వారి వద్దకు వెళ్లి నేనున్నానంటూ హామీ ఇచ్చి పామాయిల్ సాగును చేయించారని గుర్తు చేశారు.
పేద ప్రజల ఇండ్లు కూలగొట్టడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 420 ప్రభుత్వాన్ని, పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. కూలగొట్టడం, చెడగొట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి నిర్మాణాలు గానీ, ఆవిష్కరణలు గానీ చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే హామీలు నెరవేరుస్తామని, డబ్బాలు కొట్టిన ఈ చేతగాని ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచిన అమలు చేయడం లేదని వాపోయారు.