Doctorate | జ్యోతినగర్, డిసెంబర్ 10 : సామాజిక సేవలో వినూత్న కార్యక్రమాలు చెపడుతున్న ఎన్టీపీసీకి చెందిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు, చైర్మన్, దుర్గం నగేశ్ కు ఆమెరికా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.
గ్లోబల్ హ్యూమన్ పీఎస్ యూనివర్సిటీ వార్షిక కాన్వేనషన్ పురస్కరించుకోని ఈ నెల 13న చెన్నయ్ లో నిర్వహించే కార్యక్రమంలో డాక్టరేట్ ను ప్రధానం చేయనున్నట్లు యూనివర్సిటీ పేర్కొనట్లు ఆయన పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం పేదల సంక్షేమం, హక్కుల సాధనలో ప్రత్యేక గుర్తింపుతోనే అంతర్జాతీయ గుర్తింపు డాక్టరేట్ లభించినట్లు దుర్గం నగేశ్ పేర్కొని సంతృప్తిని వ్యక్తం చేశారు.