చిగురుమామిడి, సెప్టెంబర్ 23 : శరన్నవ నవరాత్రి వేడుకలలో భాగంగా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవిని రెండవ రోజు వివిధ అలంకరణలతో పూజించారు. చిగురుమామిడిలో దుర్గా దేవి పూజలో ఆలయ పూజారి ఆకవరం శివప్రసాద్ ఎస్సై సాయి కృష్ణ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మ్యానం మహేందర్ -కవిత దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఎస్ఐ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో ఉండాలని సూచించారు. మండపాల వద్ద ఇతరులకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. అనంతరం మాలాదారులు ఎస్సైని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు పెనుకుల తిరుపతి,ముక్కెర సదానందం తదితరులు పాల్గొన్నారు.