Drug | చిగురుమామిడి, మే 8: మండలంలోని ఓగులాపూర్, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట గ్రామాలలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర గురువారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. నేటి యువత మత్తుకు బానిస కాకుండా ఉద్యోగ అవకాశాలలో రాణించాలన్నారు. మంచి గుర్తింపును సాధించి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు.
డ్రగ్స్ ద్వారా వచ్చే అనర్థాలను జేఏసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య గ్రామాలలో వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి ఖాజా మోహినుద్దీన్, జేఏసీ నాయకులు ఉప్పుల కుమార్, గాండ్ల పద్మ, తాళ్లపల్లి జగన్, తాళ్లపల్లి ప్రభాకర్, ఏపిఎం సంపత్, మాజీ జెడ్పిటిసి అందే స్వామి, ఐకెపి (సేర్ప్) సిసి దుబ్బాక వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు సుమంత్, నరేష్, సంపత్, శ్రీనివాస్ రెడ్డి తోపాటు, నాయకులు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాదె రఘునాథరెడ్డి, కళాబృంద సభ్యుడు కందుకూరి శంకర్ బాబు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.