Huzurabad | హుజురాబాద్, అక్టోబర్ 20 : హుజురాబాద్ పట్టణం లోని హై స్కూల్ క్రీడా మైదానంలో ఉన్న మండల విద్యాధికారి కార్యాలయం ముందు రాత్రి మందు బాబుల హల్చల్ చేశారు. ఆదివారం కార్యాలయానికి సెలవు రావడం తో తాళం వేసి ఉన్న కార్యాలయం ముందు మందు బాబులు విందు చేసుకున్నారు.
దీనిపై సోషల్ మీడియాలో ప్రజల్లో నుంచి పూర్తి వ్యతిరేకత రాగా పోలీసులు తొలగించారు. ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మందు బాబులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.