కార్పొరేషన్, జూలై 25: నగరాన్ని ముసురు వాన వీడడంలేదు. వారం రోజులుగా చినుకు లు పడుతూనే ఉన్నాయి. దీంతో జనజీవ నం స్తంభించిపోయింది. బుధవారం రాత్రి ఓ మో స్తారు వర్షం కురిసింది. రోడ్లపై వాననీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీల్లోని నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. బల్దియా డీఆర్ఎఫ్ బృం దాలు ఆయా ప్రాంతాలకు చేరుకొని రో డ్లపై నిలిచిన నీటి డ్రైనేజీలకు పంపించారు. కా గా ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీటిని తరలించా రు. నగరంలో వర్షాలతో ఎలాంటి పరిస్థితులు ఎ దురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బల్దియా అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు.
నగరంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 3వ డివిజన్ కిసాన్‌నగర్‌లో బండ లక్ష్మీనారాయణకు చెం దిన పాత ఇల్లు గురువారం కూలిపోయిం ది. స్థానిక కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తహసీల్దార్ రమేశ్, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి సంధ్య కూలిన ఇం టిని పరిశీలించారు. నష్టంపై ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు.